సీఐడీ విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత VijaySaiReddy విజయసాయిరెడ్డి. లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డికే అన్నీ తెలుసని ఆయన స్పష్టంగా తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పై జరిగిన సీఐడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ పాలసీపై తన ఇంట్లో రెండు సమావేశాలు జరిగాయని అంగీకరించిన ఆయన, ఆ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిలు పాల్గొన్నట్టు వెల్లడించారు. కానీ లంచాలు, మద్యం లావాదేవీల గురించి తనకు సమాచారం లేదన్నారు.
‘‘అన్నీ రాజ్కసిరెడ్డికే తెలుసు’’: విజయసాయి
విజయసాయిరెడ్డి ప్రకారం, ఈ వ్యవహారాల్లో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ వంటి వ్యక్తులు ఉన్నారా? రాజ్ వసూళ్లు చేసి ఎవరికి ఇచ్చాడో తెలుసా? అనే ప్రశ్నలన్నింటికీ ‘‘తెలీదు’’ అనే సమాధానమే ఇచ్చారు. తన అల్లుడి కంపెనీకి అప్పులు ఇప్పించిన వ్యవహారాన్ని కూడా అంగీకరించిన విజయసాయిరెడ్డి, వాటి వెనక అర్బిందో–రాజ్ కసిరెడ్డి మధ్య ఆర్థిక సంబంధాలున్నాయని వ్యాఖ్యానించారు.
‘‘రాజ్ మోసం చేశాడు, తెలివైన క్రిమినల్’’
మీడియా ముందు మాట్లాడిన విజయసాయిరెడ్డి, ‘‘రాజ్ కసిరెడ్డి నన్ను మోసం చేశాడు, ఆయన తెలివైన క్రిమినల్’’ అని వ్యాఖ్యానించారు. తనను నమ్మించి మోసం చేశాడని, పార్టీ పరిచయం వల్లే ఆయనను ప్రోత్సహించానని అన్నారు. తనకు తెలిసినదంతా సీఐడీకి వెల్లడించానని చెప్పారు.
సాక్షిపై ఆగ్రహం, రాజకీయ వ్యాఖ్యలు
తాను స్థాపించిన సాక్షి పత్రికే ఇప్పుడు తనిపై తప్పుడు కథనాలు రాస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బీజేపీలో చేరి రాజ్యసభకు వెళ్తున్నా’’ అనే ప్రచారం అసత్యమన్నారు. రైతుగా కొనసాగతానని, రాజకీయాల్లోకి రావాలంటే ప్రజలే కోరాలని అన్నారు. కోటరీపై వ్యాఖ్య చేస్తూ, అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ ద్వారా తనకు అవమానాలే ఎదురయ్యాయని వాపోయారు.
రాజ్ కసిరెడ్డి బలి? విజయసాయి మాస్టర్‌మైండ్?
విజయసాయిరెడ్డి తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారంటున్నారు. జగన్‌ను విమర్శించకుండా, రాజ్‌ను పూర్తిగా బలిపశువుగా మార్చేందుకు రాజకీయంగా ప్లాన్ చేశారని అంచనా. పార్టీలో రాజకీయ లెక్కలు VijaySaiReddy మారుతున్నాయి.
ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి… మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం గరుడనేత్రాన్ని ఫాలో అవ్వండి.