అమెరికా కొత్త బిల్లు.. వణికిపోతున్న భారత విద్యార్థులు Indian Students in USA

US Student Visa Changes 2025

వాషింగ్టన్: అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students in USA)ను మరో పెద్ద సమస్య వెంటాడుతోంది. ఇప్పటివరకు అక్రమ వలసదారులపై తీవ్రంగా వ్యవహరించిన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు సక్రమ వీసాలతో ఉన్న విదేశీ విద్యార్థుల భవిష్యత్‌పైనా తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంటోంది.

OPT రద్దు బిల్లుతో కలకలం

అమెరికాలో STEM సబ్జెక్టుల్లో (Science, Technology, Engineering, Mathematics) మాస్టర్స్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు సాధారణంగా Optional Practical Training (OPT) ద్వారా అక్కడే పని చేసుకునే అవకాశాన్ని పొందుతున్నారు. అయితే తాజాగా అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లుతో ఈ OPT ప్రోగ్రామ్‌ను రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ బిల్లు అమలులోకి వస్తే, అమెరికాలో ఉన్నత విద్యను పూర్తిచేసిన స్టూడెంట్స్ చదువు పూర్తికాగానే అమెరికా వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది F1 మరియు M1 వీసా హోల్డర్ల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించనుంది.

భారత విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో

ప్రస్తుతం అమెరికాలో ఉన్న 3 లక్షల పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఈ బిల్లుతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే Indian Students in USA ఉద్యోగం పొందాలన్న కలలు కంటున్న వారికి ఇది పెద్ద షాక్‌గా మారింది.

ఈ బిల్లు అమలులోకి వస్తే:

ఉద్యోగావకాశాలపై పెద్ద ఇంపాక్ట్

ఇండియన్ స్టూడెంట్స్ దేశం విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి

అమెరికాలో విద్యా ఖర్చులపై రిటర్న్ తగ్గిపోవచ్చు

వీసా విధానాల్లో మార్పులు మరింత కఠినంగా మారే అవకాశం

Leave a Comment