యూనియన్ బ్యాంక్ 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల Government Jobs నోటిఫికేషన్ విడుదల – డిగ్రీ, పీజీ అర్హత – CBT, GD, ఇంటర్వ్యూలో ఎంపిక – మే 20 వరకు అప్లై చేయండి.
కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 20, 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 500
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్
శాఖలు: క్రెడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) తదితర విభాగాల్లో
అర్హతలు:
సంబంధిత విభాగానికి అనుగుణంగా డిగ్రీ / పీజీ ఉత్తీర్ణత అవసరం
వయో పరిమితి: సాధారణ అభ్యర్థులకు గరిష్ఠంగా 30 ఏళ్లు
SC/ST/OBC/PWD అభ్యర్థులకు Government Jobs ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
గ్రూప్ డిస్కషన్ (GD)
ఇంటర్వ్యూ
దరఖాస్తు వివరాలు:
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్
చివరి తేదీ: మే 20, 2025
అధికారిక వెబ్సైట్: www.unionbankofindia.co.in






