సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో కలిసి తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించిన Ap letest news మంత్రి పార్థసారథి, హౌసింగ్ ఎండి రాజబాబు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడిన మంత్రి పార్థసారథి, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎండి రాజబాబు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తాము నష్టపోయామని , తమ అకౌంట్లో పడిన డబ్బులను కూడా సంతకాలు పెట్టించుకుని తీసుకున్నారని… పనిచేయకుండానే బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారని, తమ ఇల్లు కట్టించకుండా తమను మోసం చేశారని మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకున్న లబ్ధిదారులు.
మంత్రి కామెంట్స్
గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి గృహ నిర్మాణ పథకాన్ని అభాసుపాలు చేసింది : మంత్రి పార్థసారది గత ప్రభుత్వంలో ఈ జిల్లాలో పేదల గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో మంత్రులు, స్థానిక శాసనసభ్యుల సూచనల మేరకు ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేసాం… ఈ ఎంక్వయిరీ లో అక్రమాలు జరిగినట్లు గుర్తించాం : మంత్రి పార్థసారథి పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయల దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మంత్రి పార్థసారథి ఇళ్ల నిర్మాణాలను నాసిరకంగా నిర్మించి, నిరుపేదలు, అమాయకులైన గిరిజనులను మోసం చేసి దోచుకున్న కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం : మంత్రి రెవిన్యూ యాక్ట్ ప్రకారం దోచుకున్న డబ్బును తిరిగి రికవరీ చేసి, పేదలకు నాణ్యత గల ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం : మంత్రి పార్థసారథి నిరుపేదలైన అమాయకులను దోచుకోవడం చాలా దారుణం.

ఎవర్ని వదలం
దౌర్భాగ్యం.. ఇంతకంటే నీచమైనది ఏదీ లేదు : మంత్రి పేదల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది… ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఎస్సీలు, బీసీలకు 50,000, ఎస్టిలకు 75000 అదనపు సహాయాన్ని మంజూరు చేస్తున్నాం : మంత్రి ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు అర్హత ఉన్న పేదలందరికీ నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి గారి కామెంట్స్ఇ ల్లు నిర్మించకుండానే అమాయకులైన గిరిజనుల నుంచి వేలిముద్రలు వేసుకుని డబ్బులు దోచుకున్నారు : సోమిరెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను, గత ప్రభుత్వ నాయకులను హౌసింగ్ కాలనీల ముందు దోషులుగా నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి : సోమిరెడ్డి హౌసింగ్ లో Ap letest news అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కోరుతున్నాను : సోమిరెడ్డి