వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు దంపతులు
ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరం వేంచేసియున్న శ్రీ కోదండ సీతారామస్వామి Mylavaram News వారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం నేత్రపర్వంగా నిర్వహించారు. సీతారాముని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.. ఈ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సతీమణి శిరీష పాల్గొన్నారు. మొదట దేవతా మూర్తులను దర్శించుకున్నారు. వేదపండితుల శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం శాసనసభ్యులు కృష్ణప్రసాదు దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. ఈ కల్యాణ Mylavaram News వేడుకల్లో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
