రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు Thalliki Vandanam కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ పథకం అమలులో కీలకమైన నిబంధనను అధికారులు వెల్లడించారు.
ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనున్నారు. అయితే ఈ మొత్తం పొందాలంటే తల్లుల బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ మరియు NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అయి ఉండాలి. లింకింగ్ ప్రక్రియను జూన్ 5 లోపు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఖాతా లింకింగ్ కోసం స్థానిక పోస్టల్ సిబ్బంది, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది లేదా బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరమైన పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ లాంటి వివరాలతో సంప్రదించాలి.
ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువులో తల్లుల భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో Thalliki Vandanam పాటు, వారి ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.






