తెలంగాణలో నేటి నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు SCClassification

SCReservation

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు నేటి నుంచే ప్రభుత్వం SCClassification అధికారికంగా జీవో జారీ చేసింది. దాదాపు 30 ఏళ్లుగా కొనసాగిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ప్రతిఫలంగా ఇది చట్టబద్ధంగా అమలులోకి రానుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14నే అమలుదినంగా ప్రభుత్వం నిర్ణయించింది.

59 ఉపకులాలకు మూడు గ్రూపులుగా విభజన

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఎస్సీల్లోని మొత్తం 59 ఉపకులాలను సామాజిక, విద్యా, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించింది.

  • గ్రూప్ 1: పూర్తిగా వెనుకబడ్డ 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్

  • గ్రూప్ 2: మద్యస్థ స్థితిలో ఉన్న 18 ఉపకులాలకు 9% రిజర్వేషన్

  • గ్రూప్ 3: గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్

సీఎం రెవంత్ రెడ్డికి జీవో కాపీ అందజేత

వర్గీకరణ జీవో విడుదల అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై, మంత్రులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి తొలి జీవో కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాలపై వర్గీకరణ ప్రభావం

ఈ జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా సంస్థల ప్రవేశాల్లో కొత్త వర్గీకరణ విధానం వర్తించనుంది. సుప్రీంకోర్టు తీర్పును SCClassification అనుసరిస్తూ దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తిగా అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

Leave a Comment