లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ రూరల్ (ఐతవరం) : రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ మొదలైంది. Ap news ఒకటో తేదీ రావడంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మరియు సచివాలయ సిబ్బందితో కలసి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల( Tangirala Sowmya) సౌమ్య
ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మరియు కూటమి నేతలతో కలసి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసారు. అనంతరం గోకులం షెడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “రాష్ట్రంలో పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నా సరే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఒక్కొక్కటిని అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్లను మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం అని గుర్తు చేసారు. అదే విధంగా వితంతువులైన మహిళలకు సకాలంలో పింఛన్లను అందించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదని, పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వ సేవలు అందరికీ అందిస్తున్నాం” అని తెలిపారు.