శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు. “పోలీసు యూనిఫాం మేం Ratna Comments on Jagan పోని దారుల్లో సంపాదించలేదు, మేము కష్టపడి సాధించాం. ఎవరైనా తప్పు చేస్తే రూల్స్ ప్రకారం శిక్ష పడుతుంది. కానీ మేము ఎవరికి అనుకూలంగా పని చేయలేదు” అని ఆమె స్పష్టం చేశారు. జగన్ పర్యటన సమయంలో భద్రత విషయంలో వచ్చిన విమర్శలపై స్పందించిన ఎస్పీ రత్న, “పర్యటనకు రెండు జిల్లాల ఎస్పీలు కలిసి బందోబస్తు నిర్వహించాం. హెలిప్యాడ్ వద్ద ఎవరూ రాళ్లు లేదా కర్రలు వేయలేదు. పోలీసులు పూర్తిగా నిబంధనల ప్రకారం వ్యవహరించారు. కొందరు కవ్వించినా, పోలీసులు పూర్తి సంయమనం పాటించారు” అని తెలిపారు.
వైసీపీ నేతల మండిపాటు
వైఎస్సార్సీపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందిస్తూ, “ఒక DGP స్థాయి అధికారి టీడీపీకి మద్దతుగా పని చేశాడని మర్చిపోయారా? ఆయన్ని 5 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా నీళ్లు తాగించారు. పోలీసు వ్యవస్థలో రాజకీయం నేరుగా జోక్యం చేసుకుంటుంది” అని ఆరోపించారు. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. SP Ratna Comments on Jagan అయితే పోలీసులు తాము అన్ని నిబంధనల మేరకు పని చేశామని, రాజకీయం అర్ధం చేసుకోకుండా విమర్శించరాదని ఎస్పీ రత్న సూచించారు.
