అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం గుంటూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. Telugu student dies in America రాజేంద్రనగర్‌కు చెందిన యువతి దీప్తి, పై చదువుల కోసం కొంతకాలం క్రితం యునైటెడ్ స్టేట్స్ వెళ్లింది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఆమె ఎంఎస్ చేస్తున్నారు.
ప్రమాద సమయంలో వీధిలో నడిచి వెళ్తున్నారు
ఏప్రిల్ 12న, దీప్తి తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ కారు వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువతి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇంటికి రానున్నదే… కానీ విషాదం ఎదురైంది
దీప్తి కోర్సు ఇంకో నెలలో పూర్తవ్వాల్సి ఉంది. కోర్సు పూర్తయిన తర్వాత ఇండియాకు తిరిగి రావాలని ఆమె ఆలోచనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. Telugu student dies in America కానీ ఆ ఆశలు ఆవిరైపోయాయి. దీప్తి మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.