మనిషికి నిద్రచాలా అవసరం. మనిషి జీవనంలో తిండి లేకపోయినా కొన్ని రోజులు బతికేయవచ్చు, కానీ Sleep study 2025 నిద్ర లేకుండా ఉండటం అసాధ్యం. రెండు రోజులకంటే ఎక్కువ నిద్ర లేకుండా గడపడం చాలా కష్టసాధ్యం. దీన్నే నిద్ర అవసరమనే గొప్పతనం చెబుతుంది.
సాధారణ నమ్మకం
సాధారణంగా వైద్యులు, నిపుణులు రోజుకు 7-8 గంటల నిద్ర అవసరమని చెబుతారు. కానీ ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సర్వే మాత్రం ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
దేశానికో నిద్ర పద్ధతి ఉంది
- ఈ సర్వేలో 20 దేశాలకు చెందిన 5 వేల మందిపై అధ్యయనం చేశారు.
- బ్రిటన్ ప్రజలు సగటున 10.26 గంటల పాటు నిద్రపోతున్నారు. ఇది ఆరోగ్యానికి మించి అనిపించే స్థాయి.
- అమెరికన్లు సుమారు 8.13 గంటలు నిద్రపోతారు, కానీ వారిలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి.
- భారతీయులు సగటున 7.15 గంటలు నిద్రపోతారు – ఇది ప్రపంచ సగటుతో దాదాపు సమానమే.
- ఫ్రాన్స్ ప్రజలు 7.52 గంటల నిద్రతో ఎక్కువగా నిద్రించే వారిలో ఒకరు.
- జపాన్ ప్రజలు మాత్రం కేవలం 6.18 గంటలే నిద్రపోతారు – ప్రపంచంలో తక్కువ నిద్రపోయే వారిగా నిలిచారు.
ఆసక్తికర అంశం ఏమిటంటే!
- ఎక్కువ నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారని, తక్కువ నిద్రపోయేవారు అనారోగ్యంగా ఉంటారని చెప్పే ఆధారాలు ఈ సర్వేలో లభించలేదు.
- ప్రతి దేశంలో సంస్కృతి, జీవనశైలి, ఆహారం, వాతావరణం ప్రకారం నిద్ర గంటలు మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
- అంటే, ఒక దేశానికి సరిపోయే నిద్ర సమయం మరొక దేశానికి సరిపోకపోవచ్చు.

నిపుణులు ఏమంటున్నారంటే..
డాక్టర్ దల్జిందర్ చామర్స్ (కీలే యూనివర్సిటీ, స్లీప్ సైకాలజిస్ట్) చెబుతున్నదేమిటంటే “మీ నిద్ర సమయం, మీ ఆరోగ్యం మీ సంస్కృతి, జీవనశైలికి అనుగుణంగా ఉండాలి”. డాక్టర్ క్రిస్టీన్ (విక్టోరియా స్కూల్ ఆఫ్ నర్సింగ్) ప్రకారం “ఒక దేశంలో తగిన నిద్ర Sleep study 2025 మరొక దేశంలో అతిగా లేదా తక్కువగా పరిగణించబడవచ్చు”.