తిరుపతి రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయి.. బూతులు మాట్లాడే నేతలు Venkayyanaidu hot comments ఎక్కువయ్యారు.. గత ఏపీ ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలను ప్రజలు ఇంటికి పంపారు. దౌర్జన్యాలు, బెదిరింపులు పాల్పడినవారు ఘోరంగా ఓడారు..ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్ లోనే ప్రజలు సమాధానం చెప్పారు. తుపాకీతో భయపెట్టాలని చూసినవారు ఆ తుపాకికే బలయ్యారు..ఎన్నికలంటే ప్రజల్లోనూ మార్పు రావాలి. ఉచితమని ప్రకటన చేసే ప్రతి పార్టీని ప్రశ్నించాలి..ఉచితం అనుచితానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది.. ఎన్నికల్లో డబ్బు, కులం, ప్రాంతాలకే ప్రాధాన్యత పెరిగింది.. రాబోయే ఎన్నికల్లో అవేమీ ఉండకూడదు. ఓ పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్తే.. పార్టీకి, పదవికి రాజీనామా చేయాలి.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమగ్రంగా మార్చాలి.. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నికకు సిఫార్సు చేస్తుంది.. ఒకేసారి ఎన్నికలు జరిగితే రూ.12 వేల కోట్లు ఆదా అవుతుందనిమాజీ Venkayyanaidu hot comments ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు : Venkayyanaidu hot comments
by గరుడ నేత్రం
Published On: April 13, 2025 10:14 am
