Sabarimala Temple Controversy : శబరిమల అయ్యప్ప ఆలయంలో అప‌చారం

sabarimala

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడం రేకులు Sabarimala Temple Controversy తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేరళ హైకోర్టు సుమోటో విచారణ ప్రారంభించింది.

కేరళలో శబరిమల ఆలయం వివాదంలోకి కేరళ రాష్ట్రంలోని పతనం తిట్ట జిల్లాలో ఉన్న ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆలయ సన్నిధానం వద్ద ఉన్న ద్వారపాలక విగ్రహాలపై అమర్చిన బంగారు తాపడం (గోల్డెన్ ప్లేట్స్) తొలగించారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.

చంద్రగ్రహణం పేరుతో తొలగింపు?

కొంతమంది స్థానికులు మరియు భక్తుల ఆరోపణల ప్రకారం, చంద్రగ్రహణం పేరుతో విగ్రహాలపై ఉన్న బంగారు రేకులను తొలగించి అక్రమ రవాణా చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ద్వారపాలక విగ్రహాలను పూర్తిగా తొలగించారన్న వదంతులు కూడా భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

హైకోర్టు సుమోటో విచారణ

ఈ వివాదంపై కేరళ హైకోర్టు తానే ముందుకు వచ్చి (సుమోటో) విచారణ ప్రారంభించింది.
కోర్టు, బంగారు తాపడం పనులకు సంబంధించిన అన్ని రికార్డులను Sabarimala Temple Controversy వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.

Leave a Comment