కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో రేషన్ Ration distribution దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు. జూన్ 1 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చినట్టు ఆయన తెలిపారు.
కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల మొదటి నుంచి రేషన్ సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దివ్యాంగులు మరియు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందిస్తాం,” అని తెలిపారు.
అలాగే, నెలలో తొలి 15 రోజులు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కార్డుదారులు తమ ఇంటికి దగ్గరలోని ఏ రేషన్ దుకాణంలోనైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు వివరించారు. ప్రభుత్వం ప్రతి చౌక Ration distribution దుకాణానికి అదనంగా 10 శాతం బియ్యం సరఫరా చేస్తోందని కూడా కోగంటి బాబు పేర్కొన్నారు.