PM Rojgar Yojana : ఆగస్టు 1 నుంచి కొత్త పథకం

PM Rojgar Yojana

ఉద్యోగ అవకాశాల పెంపును లక్ష్యంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం “పీఎం వికసిత్ భారత్ రోజ్ PM Rojgar Yojana గార్ యోజన” ను ఆవిష్కరించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యంతో ఆగస్టు 1 నుండి ఈ పథకం అమలుకానుంది.

భారత దేశ యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పేరిట ఒక కొత్త ఉద్యోగ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు కల్పించటం లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తోంది. పథకం అమలు కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ. 99,446 కోట్లు ఈ పథకానికి మంజూరు చేసింది. ఈ పథకం 2025 ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది.

ఉద్యోగులు, సంస్థలకు ప్రయోజనాలు:
ఈ పథకం కింద తొలిసారి ఉద్యోగంలోకి అడుగుపెట్టే EPFO ఖాతాదారులకు రూ.15,000 ప్రోత్సాహకంగా ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే, ప్రతి ఉద్యోగం కల్పించిన సంస్థలకు రూ.3,000 చొప్పున ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది.

ఈ పథకంతో దేశ వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలు నూతన ఉద్యోగాలను కల్పించేందుకు ఉత్సాహం పొందే అవకాశముంది. ఉద్యోగం, నైపుణ్య అభివృద్ధి, మరియు ఆర్థిక పురోగతి వైపు మరో ముందడుగు వేసినట్టుగా కేంద్రం భావిస్తోంది.

ముఖ్యాంశాలు:

  • పథకం పేరు: పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన
  • ప్రారంభం: ఆగస్టు 1, 2025
  • నిధులు: రూ.99,446 కోట్లు
  • ఉద్యోగ లక్ష్యం: రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు
  • ఉద్యోగి ప్రయోజనం: EPFO ఖాతాదారులకు రూ.15,000
  • సంస్థలకు మద్దతు: ప్రతి PM Rojgar Yojana ఉద్యోగానికి రూ.3,000

Leave a Comment