దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన PM Kisan 20th installment 20వ విడత కింద రూ.2,000 నిధులు త్వరలో ఖాతాల్లోకి జమ కానున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం జూలై 18న కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
ఈనెల జూలై 20న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటన నేపథ్యంలో… ఆ పర్యటనకు ముందు రోజే (జూలై 18న) నిధులు జారీ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా ఆధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పీఎం కిసాన్ 20వ విడత వివరాలు:
- మొత్తం సాయం: రూ.2,000 (ప్రతి అర్హుడైన రైతుకు)
- విడుదల తేదీ (అంచనా): జూలై 18, 2025
- పూర్తి లబ్ధిదారుల సంఖ్య: సుమారు 9 కోట్ల మంది రైతులు
- PM-KISAN సాయం పొందాలంటే రైతులు ఈ కిందివి ఖచ్చితంగా పాటించాలి:
ఈ-కెవైసీ పూర్తి చేయాలి - ఆధార్, బ్యాంక్ ఖాతా అనుసంధానం చేయాలి
- ల్యాండ్ పటా వివరాలు అప్‌డేట్ చేయాలి
- వాస్తవ రైతుగా నమోదు కావాలి (బినామీ లేదా ప్రభుత్వ ఉద్యోగులకు లభ్యం కాదు)
ఎలా చెక్ చేయాలి – మీ ఖాతాలో డబ్బు వచ్చిందో లేదో?
- అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: https://pmkisan.gov.in
- ‘Beneficiary Status’ క్లిక్ చేయండి
- మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ PM Kisan 20th installment ఎంటర్ చేయండి
- స్టేటస్ చూసేందుకు ‘Get Data’ క్లిక్ చేయండి.