జనసైనికులు రెచ్చగొట్టే ప్రయత్నాలకు లోనవ్వకూడదని, చట్టపరంగా ముందుకు వెళ్లాలని పవన్ Pawan Kalyan News కల్యాణ్ సూచించారు. మచిలీపట్నం ఘటనలపై పార్టీ అంతర్గత విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
జనసైనికులకు పవన్ సూచనలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. “జనసైనికులను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎవరు రెచ్చగొట్టినా, దుందుడుకు చర్యలకు పాల్పడవద్దు. చట్టపరమైన చర్యల ద్వారానే ముందుకు వెళ్ళాలి” అని ఆయన స్పష్టంగా సూచించారు.
మచిలీపట్నం ఘటన వివాదాస్పదం
ఇటీవల మచిలీపట్నంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు పవన్ కల్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పెట్టారు. దాంతో స్థానిక జనసైనికులు ఆగ్రహంతో దాడి చేసి, ఆ వైద్యుడితో క్షమాపణ చెప్పించారు. ఈ వీడియో వైరల్ కావడంతో, కుల రాజకీయాల వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, “ఇది రాజకీయ కుట్ర” అని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా కుట్రలపై హెచ్చరిక
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్ల ద్వారా కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. తిట్లతో రెచ్చగొడుతున్నారు. ఆవేశానికి లోనై ఘర్షణ పడితే సమస్య జటిలం అవుతుంది” అని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో, భారత న్యాయ సంహిత ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రెచ్చగొట్టే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
పార్టీ అంతర్గత విచారణ
మచిలీపట్నం వివాదంపై పార్టీ లోపలే విచారణ చేపట్టాలని పవన్ ఆదేశించారు. ఈ ఘటనలో Pawan Kalyan News పాలుపంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని ఆయన నిర్ణయించారు.