పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు.. 40 మందికి Pasamailaram factory explosion పైగా మృతి.. పరిసర ప్రాంతాల్లో కలకలం
పేలుడు తాలూకు ప్రభావం మైళ్ల దూరంలో వినిపించింది. పక్కనే ఉన్న కర్మాగారాలకూ ధ్వంసం జరిగింది. పరిశ్రమలో పని చేస్తున్న 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం, అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు
పేలుడు అనంతరం మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తింపు చాలా క్లిష్టంగా మారింది. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు అవసరమవుతాయన్నది వైద్యాధికారుల అభిప్రాయం.
ఆసుపత్రుల వద్ద తల్లిదండ్రుల విలాపాలు
పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద బంధువుల విలాపాలు, కన్నీటి పారవళ్లతో వాతావరణం విషాదంగా మారింది. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
కారణాలపై విచారణ ప్రారంభం
ప్రమాదం ఎందుకు జరిగిందన్న కోణంలో పరిశ్రమలో సేఫ్టీ నిబంధనలు పాటించారా?, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అన్న కోణాల్లో సిట్ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పరిశ్రమ యాజమాన్యాన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ స్పందన
CM రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోనే అతి ఘోరమైన ఘటన అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం Pasamailaram factory explosion తీవ్రగాయాలపాలైనవారికి రూ. 10 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.