పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. Pahalgam Terror Attack పాకిస్థాన్కు చెందిన పలు యూట్యూబ్, స్పోర్ట్స్ ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని, భారత్ సైన్యంపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పాకిస్తాన్ మీడియా ఛానళ్లు భారత్‌లో కనబడడం లేదు. అలాగే, మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్కు చెందిన యూట్యూబ్ అకౌంట్ కూడా కనిపించడం లేదు. వినియోగదారులు ఈ ఛానళ్లను ఓపెన్ చేసే సమయంలో “సమాచారాన్ని తొలగించాం” అనే మెసేజ్ చూపిస్తోంది.
నిషేధానికి కారణాలు
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ఆధారిత పలు మీడియా వేదికలు భారత్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేశాయి. ముఖ్యంగా భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం జరిపారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది.
భారత్ చర్యలు
దేశ భద్రతకు ముప్పు కలిగించే వార్తలపై భారత్ గత కొద్దికాలంగా గట్టి చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారాలను నియంత్రించేందుకు కేంద్రం ప్రత్యేక టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసింది. Pahalgam Terror Attack తాజా నిషేధం కూడా అదే దిశగా తీసుకున్న కీలక నిర్ణయంగా భావించబడుతోంది.