Mobile at Night Effects : రాత్రి సెల్ ఫోన్ చూస్తున్నారా! జరిగే ప్రమాదం ఇదే

Sleep Deprivation

రాత్రిపూట ఫోన్, టీవీ స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం వల్ల నిద్రలేమి, Mobile at Night Effects మెదడు సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రపోయే ముందు ఫోన్‌లో రీల్స్, టీవీలో కామెడీ షోలు చూసేవాళ్లు చాలా మంది. కానీ ఇలా నిద్ర సమయాన్ని తక్కువ చేసి, స్క్రీన్ సమయాన్ని పెంచడం వల్ల భారీ ఆరోగ్య నష్టాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెదడు శుభ్రమవ్వాలంటే నిద్ర అవసరం
క్యాలిఫోర్నియాలోని అమెన్ క్లినిక్స్ వ్యవస్థాపకుడు డా. డేనియల్ అమెన్ చెప్పినట్లు, మనిషి మెదడు రోజుకు 60 వేల నుంచి 80 వేల ఆలోచనలు చేస్తుంది. ఈ ఆలోచనలతో నిండిపోయిన మెదడు రాత్రి సమయంలో నిద్ర ద్వారా శుభ్రం అవుతుంది. సరైన నిద్ర లేకపోతే:

  • జ్ఞాపకశక్తి తగ్గుతుంది
  • నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది
  • శరీరానికి రోజంతా అలసట
  • ఉత్పాదకత తగ్గుతుంది
  • బ్లూ లైట్ మోసం

రాత్రిపూట టీవీ, ఫోన్ స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి (Blue Light) మన శరీరంలో మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ను అణిచివేస్తుంది. ఫలితంగా:

  1. మెదడు చురుకవుతుంది
  2. పడుకున్నా నిద్ర పట్టదు
  3. ఒత్తిడి పెరుగుతుంది
  4. క్రమంగా అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి

అయితే ఏమి చేయాలి?

  • రాత్రి పడుకునే ముందు కనీసం అరగంట ముందు స్క్రీన్‌ను దూరంగా పెట్టండి
  • బ్లూ లైట్ బ్లాకింగ్ ఫిల్టర్ ఉపయోగించండి
  • నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి – అది జ్ఞాపకశక్తికి మూలం, ఆరోగ్యానికి ఆధారం
  • రోజంతా ఫోకస్ కావాలంటే ఈ రోజు అరగంట ముందే పడుకోండి

డా. అమెన్ సలహా: “మీరు చక్కగా ఆలోచించాలి, నిర్ణయాలు Mobile at Night Effects తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే… నిద్రను ప్రేమించండి.

Leave a Comment