నందిగామ పరిధిలోని అడవిరావులపాడు నయారా పెట్రోల్ బంక్ నుంచి గురువారం ఉదయం నందిగామ టీవీ ప్రతినిధికి ఫోన్ వచ్చింది. Adaviravulapadu సార్ ఇక్కడి పెట్రోల్ బంక్‌లో మోసం జరుగుతుంది. ఒక్కసారి వచ్చి చూడండి అని స్పందించిన నందిగామ టీవీ ప్రతినిధి అక్కడికి చేరుకుని బాధితుడితో మాట్లాడి నయారా పెట్రోల్ బంక్‌లో జరుగుతున్న మోసాన్ని వీడియో తీసి నందిగామ టీవీ సోషన్ మీడియా చానల్లో వాట్సాప్ చానల్‌ల్లో పోస్టు చేశారు. దీనిపై బంకు నిర్వహకుడిని వివరణ అడిగితే స్పందించడానికి నిరాకరించాడు. ఇదిలా ఉండగా.. పెట్రోల్ బంక్ వద్ద మరికొంత మంది ఆందోళన చేశారు. వెంటనే బంకును మూయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ నందిగామ టీవీ చానల్స్‌లో పెట్టడంతో వీడియో బాగా వైరల్ అయింది. ఇది జరిగింది.
లీటరుకు 8 రూపాలయలు మోసం
లీటరుకు 8 రూపాలయలు పెట్రోల్ పోయకుండా సంపాదిస్తున్నారు. ఆటోడ్రైవర్ల జేబులకు చిల్లు పెడుతున్నారు. అయితే ఒక వినియోగదారుడు మోసపోయిన విషయం గ్రహించి నందిగామ టీవీని సంప్రదించాడు. అక్కడ జరుగుతున్న మోసాల గురించి అక్కడి వారు ఇచ్చిన సమాచారం గురించి తెలుసుకుని వివరాలు అడిగితెలుసుకున్నారు మా ప్రతినిధి షాబాన్‌పాషా. అసలు ఏం జరిగిదంటే ఒక ఆటో డ్రైవర్ పెట్రోల్ పోయించుకోవడానికి అడవిరావుల పాడు బంకుకు వెళ్లాడు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఆ పెట్రోల్‌లో మోసం జరిగిందని గ్రహించాడు. నందిగామ టీవీ ప్రతినిధికి తెలియజేయగా అక్కడికి వెళ్లి మళ్లీ ప్రయత్నించమని అడిగితే అప్పడు బయటపడిరది అసలు కధ, ముందుగా ట్యాంకులో కొద్దిగా పెట్రోల్ వచ్చి ఆ తర్వాత గాలి రావడం మొదలు అయింది. కానీ మీటరు రీడిరగ్ తిరుగుతూనే ఉంది. సుమారు ఇలా 8రూపాయల వరకు వచ్చి ఆ తర్వాత పెట్రోల్ రావడం మొదలైంది.
నిముషాల్లో స్పందించిన అధికారులు
ఉదయం జరిగిన ఈ సంఘటనపై అధికారులు వెంటనే స్పందించారు. నిముషాల వ్యవధిలోనే అడవిరావులపాడు పెట్రోల్ బంకు వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు. మోసం జరుగుతున్న సంగతి గ్రహించి బంకును సీజ్ చేశారు. ఈ తనీఖీల్లో పి.డిఎస్, డిప్యూటీ తహశీల్దార్ రామ్మూర్తి రెడ్డి, Adaviravulapadu జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి భానుప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Adaviravulapadu : నందిగామ టీవీ (ఎఫెక్ట్) : నయారా పెట్రోల్ బంక్ సీజ్
by గరుడ నేత్రం
Published On: April 4, 2025 2:18 pm
