నల్గొండ జిల్లా దేవరకొండలో గవర్నమెంట్ టీచర్ సుల్తానా Telangana Education Scam ఏడాది రోజుల పాటు విధులకు హాజరు కాకుండానే జీతం తీసుకుంది. హెడ్ మాస్టర్ వేణుమాధవ్, మాజీ ఎంఈవో సామ్యా నాయక్‌లు కూడా ఇందులో భాగమైనట్లు ఆరోపణలు వెల్లడి కావడంతో వారిని విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొర్రతండ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో గత ఏడాది జూలైలో పర్వీన్ సుల్తానా అనే ఉపాధ్యాయురాలు గాగిలాపురం పాఠశాలకు డిప్యూటేషన్ పై బదిలీ అయినారు. అయితే, ఆమె అక్కడ విధులకు హాజరు కాకుండా, ఏడాది కాలం జీతం తీసుకుంటూ డుమ్మా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
హాజరు లేనిప్పటికీ జీతం ఎలా?
సుల్తానా తన విధులకు ఎప్పుడూ హాజరుకాలేదు. కానీ దేవరకొండకు అప్పుడప్పుడు వచ్చినపుడు అక్కడ హాజరు పట్టికలో సంతకం చేయించుకున్నట్లు సమాచారం. దీనికి ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్ సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి చక్రం – జీతాల్లో భాగస్వామ్యం
సుల్తానాకు వచ్చిన జీతంలో సగం జీతాన్ని హెడ్ మాస్టర్ వేణుమాధవ్, మాజీ ఇన్‌ఛార్జ్ ఎంఈవో సామ్యా నాయక్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతి వ్యవహారం ఆలస్యం అయినా వెలుగులోకి వచ్చింది.
డీఈవో నిర్లక్ష్యంపై ఆగ్రహం – కార్యాలయ ముట్టడి యత్నం
ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు డీఈవో భిక్షపతికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో సంఘాలు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమయ్యాయి.
వారిని సస్పెండ్ చేసిన విద్యాశాఖ
ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు, సుల్తానా, వేణుమాధవ్, సామ్యా నాయక్‌లను సస్పెండ్ చేశారు. Telangana Education Scam ఈ చర్య ఇతర అవినీతి ఆరోపణలపై అధికారుల దృష్టిని కూడా దృష్టిపెట్టేలా చేసింది.