మునగాకు రోగనిరోధక శక్తి పెంచడం నుంచి బ్లడ్ షుగర్ కంట్రోల్ వరకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. కానీ munagaaku benefits వీటిని సరైన విధంగా తీసుకోవడం వల్లే పూర్తి లాభాలు అందుతాయి.
మునగాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సహజ ఔషధం. రోగ నిరోధక శక్తిని పెంచడం, బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించడం, ఎముకల బలాన్ని పెంచడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక లాభాలు కలవు. అయితే వీటిని సరిగ్గా తీసుకుంటేనే అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
మునగాకు + విటమిన్ C
మునగాకులోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించాలంటే విటమిన్ C అధికంగా ఉన్న ఆహారాలతో కలిపి తీసుకోవాలి. నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజ, కివీ వంటి పండ్లతో కలిపి లేదా మునగాకు పొడిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే లాభాలు రెట్టింపు అవుతాయి.
మిరియాలతో కలిపి
మిరియాలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మరియు శోషణను పెంచే గుణాలు మునగాకులోని పోషకాల ప్రభావాన్ని పెంచుతాయి. మునగాకు పొడిలో కొన్ని మిరియాలు కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయి.
హెల్తీ ఫ్యాట్స్‌తో కలిపి
మునగాకు చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యి, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి హెల్తీ ఫ్యాట్స్‌తో కలిపి తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం పెరుగుతుంది.
ఇమ్యూనిటీ కోసం వెల్లుల్లితో
వెల్లుల్లిలో ఉన్న గుణాలు మునగాకులోని జింక్ శరీరానికి పూర్తిగా అందేలా చేస్తాయి. మునగాకు పప్పు, కూర, పచ్చడిలో తప్పనిసరిగా వెల్లుల్లి కలపాలి.
ఇలా మాత్రం తీసుకోవద్దు
మునగాకుతో కాఫీ లేదా కఫైన్ ఉన్న పానీయాలు వెంటనే తీసుకోకూడదు. కఫైన్ మునగాకులోని munagaaku benefits పోషకాలను అడ్డుకుంటుంది.
