భారీ గాలులు.. నేల‌రాలిన మామిడి Mylavaram News

Mango farmers protest in Mailavaram after cyclone damage

మామిడి రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని IFTU డిమాండ్‌

మైలవరం (Garuda Netram): తుఫాను కారణంగా జరిగిన తీవ్ర గాలుల ధాటికి మామిడి తోటలు బాగా నష్టపోయాయి. మైలవరం Mylavaram News నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మామిడికాయలు నేల రాలాయి.. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన మామిడి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) జిల్లా ప్రధాన కార్యదర్శి జి. హరికృష్ణ రెడ్డి, మైలవరం Ap Latest News నియోజకవర్గ IFTU కార్యదర్శి కొప్పుల కుమార్ నాయకత్వంలో రైతుల తరఫున ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది

తుఫాను అనంతరం తోటలన్నీ నష్టపోవడంతో దళారులు కూడా మామిడికాయలు కొనట్లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు కాయల్ని అమ్మలేరు, పారవేసే పరిస్థితిలో ఉన్నారు. దీనిపై మామిడి రైతులు ప్రభుత్వాన్ని (Mango farmers cyclone loss Mailavaram) ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి

“రైతులు రోడ్డున పడే పరిస్థితి వద్దు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. మైలవరం మామిడి రైతుల పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం Mylavaram News సహాయం చేయాలి,” అని ఐఎఫ్‌టీయూ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, శీను, వెంకటేశ్వరరావు, కొండలు, వినోదరావు, తిరుపతిరావు, కృష్ణారావు, మరియన్న తదితర మామిడి రైతులు పాల్గొన్నారు.

Mango Farmers Demand Government Help in Mailavaram After Cyclone Damage
Mango Farmers Demand Government Help in Mailavaram After Cyclone Damage

Leave a Comment