మ‌ళ్లీ మొద‌లైన “మంచు” కొడ‌వ‌.. మ‌నోజ్ స‌వాల్‌ : Manchu Manoj Emotional Speech

Actor Manchu Manoj emotional during press meet over family issues

హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మనోజ్ Manchu Manoj Emotional Speech త‌న కుటుంబ వివాదంపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన అనుభవాలను మీడియా ముందు పంచుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

హైకోర్టు అనుమతించినా.. ఇంటిలోకి రానివ్వలేదని మనోజ్ ఆరోపణ
మంచు మనోజ్ చెబుతున్నట్లు, జల్పల్లిలోని తన తండ్రి మోహన్‌బాబు నివాసంలో ఉండేందుకు హైకోర్టు అనుమతించినా, తనను ఇంట్లోకి రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “నా కుటుంబం కోసం చాలా చేసాను. కానీ నన్ను ఇప్పుడు ఇలా తిరస్కరిస్తున్నారు,” అని మనోజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విష్ణు కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు మనోజ్ హాట్ కామెంట్స్
తన అన్న మంచు విష్ణు కోసం ఎన్నో సినిమాల్లో పనిచేసినట్టు చెప్పిన మనోజ్, ఆ సినిమాలకు తాను డబ్బులు తీసుకోలేదని ఆయ‌న మీడియా ముందు చెప్పారు. “విష్ణు ప్రొడక్షన్‌లో చేసిన సినిమాలకు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అన్నకి సహాయం చేశాను అనుకున్నా అంతే గాని డ‌బ్బుల కోసం చేయ‌లేదు. ఇప్ప‌డు వాళ్లు మ‌రో కోణంలో చూస్తున్నారు.ఇప్పుడు ఆయననుంచి మాత్రమే కాదు, ఇంటివారి నుంచీ కూడా దూరంగా చేశారంటే బాధేస్తుంది,” అని పేర్కొన్నారు.

సాక్షాలుంటాయని హెచ్చరిక
మంచు మనోజ్ తాజాగా కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు నాపై, నా ఇంటిపై జరిగిన దాడులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గరే ఉన్నాయి అంటే ఈ సంద‌ర్భంగా అన్న‌కు వార్నింగ్ ఇచ్చాడు.
నేను తప్పు చేశాన‌ని ఒక్క సాక్ష్యం చూపించగలిగితే, నేను గుండు కొట్టించుకుని తిరుగుతాను, అంటూ Manchu Manoj Emotional Speech అన్న‌కు సవాల్ విసిరారు. మీరుగాని ఒక్క నిజం నిజం నిరూపిస్తే, అందరి కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతాను అంటూ మంచు మ‌నోజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Leave a Comment