అఘోరీ, శ్రీ వర్షిణీ అన్నంత పని చేశారు. కళీమాత గుడిలో వీరు Lady Aghori Marriage పెళ్లి చేసుకున్నారు. పసుపు కొమ్ము, తాళిబొట్టు కట్టి శ్రీ వర్షిణీని అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు. అయితే అమ్మాయి అలంకారంలో అఘోరి ఉండగా శ్రీ వర్షిణీ పెళ్లి చేసుకుంది. వీరు పెళ్లి చేసుకోవాలని గత కొన్ని రోజులుగా అనుకుంటున్నారు. వీరికి తల్లిండ్రులకు మధ్య గొడవలు కూడా జరిగాయి. వర్షిణీని తమ ఇంటికి తీసుకువచ్చారు. అయినా తనకు అఘోరినే కావాలని పట్టుబట్టడంతో మళ్లీ అఘోరి వద్దకు చేరింది. నేడు వీరి వివాహం జరిగింది. అయితే వర్షిణీ తన భర్త అఘోరి అని చెప్పడం ఇక్కడ విడ్డూరంగా ఉంది. శ్రీ వర్షణీ అఘోరి ఓ వీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తమ పెళ్లి చాలా బాగా జరిగిందని తెలిపింది. మా గురువుగారి సమక్షంలో ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. తన భర్త నల్లబంగారం అని చాలా మంచివాడని పొగిడింది.
అఘోరితో పిల్లలను కంటాను
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పెళ్లి ఘనంగా జరిగిందని, చాలా ఆనందంగా ఉందని చెప్పింది. బీటెక్ చేశావు కదా మంచి అందమైన అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగితే నా భర్తకు ఏం తక్కువ చాలా అందగాడు అని నల్లబంగారం అని నిజమైన రంగు అని సంబరపడిపోతూ చెప్పింది. ఇక్కడ కొస మెరపు ఏంటంటే శివుడికి తన లింగాన్ని సమర్పించానని గతంలో అఘోరి చెప్పింది. అయితే అఘోరితో పిల్లలను కంటానని ఇప్పడు వర్షిణి చెబుతుంది. మరి అది ఎలా సాధ్యం అంటూ నెటిజన్లు అడుగుతున్నారు.
తల్లిదండ్రులు మా దగ్గరే ఉంటారు..
పెళ్లి తర్వాత మా తల్లదండ్రులు ఏమంటారో అని అందరూ అడుగుతున్నారు. మీకు ఎందుకు ఇబ్బంది. మా తల్లిండ్రులు మా వద్దే ఉంటారు. వాళ్లకు మేము నచ్చచెప్పుకుంటాం, వాళ్లు సరే అంటే మా దగ్గరే ఉండమని అడుగుతాం అంటూ చెప్పుకోచ్చింది. అయితే వాళ్ల సంగతి ఇప్పుడు కాదని కొంతకాలం మేము ఎంజాయ్ చేయాలని ఆ తర్వాతే వారి గురించి Lady Aghori Marriage ఆలోచిస్తామని తెలిపింది.
