కడప మహానాడు ప్రాంగణానికి నడుచుకుంటూ TDP Mahanadu 2025 చేరుకున్న ఎంపీ కేశినేని శివనాథ్, తొలి సారిగా ఎంపీ హోదాలో మహానాడులో పాల్గొన్నారు. టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్నిపెంచిన ఈ ఘటనపై పార్టీ వర్గాల్లో చర్చ.
తెలుగు దేశం పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక మహాసభ “మహానాడు 2025” సందర్భంగా కడప మహానాడు ప్రాంగణానికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నడుచుకుంటూ రావడం టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ట్రాఫిక్ రద్దీ కారణంగా, ఎంపీ శివనాథ్ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ తో కలిసి పాదయాత్రగా మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.
ఈ మహానాడులో ఎంపీ హోదాలో తొలిసారిగా పాల్గొంటున్న శివనాథ్, తన పేరును అధికారికంగా నమోదు చేసుకున్నారు. కడపలో మహానాడు నిర్వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. “43 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఈ రోజు నాడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్యకర్తల సమక్షంలో మహానాడు జరుపుకుంటోంది. ఇది ప్రతి టిడిపి కార్యకర్తకు పండుగ వాతావరణం,” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఒక కీలక ప్రకటన చేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టిడిపి జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకునే తీర్మానం పార్టీ తరఫున ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుండి పెద్దఎత్తున తరలివచ్చి మహానాడులో పాల్గొంటుండటంతో, ప్రాంగణం సందడిగా మారింది. TDP Mahanadu 2025 మహానాడులో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
