బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో Congress vs BRS జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాజకీయ పరిస్థితిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు
ప్రారంభంలో, జమ్మూకాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు నిమిషం మౌనం పాటించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణను 1956లో బలవంతంగా ఆంధ్రాతో కలిపినది కాంగ్రెస్ పార్టీ. 1969 ఉద్యమాన్ని కూడా రక్తపాతం చేశేది ఇదే పార్టీ,” అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
చంద్రబాబు, కాంగ్రెస్ లపై విమర్శలు
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక మోసం చేశారని విమర్శించారు.
ఎన్నికల హామీలు గాలికి
“పెన్షన్ పెంపు, రుణమాఫీ, స్కూటీలు, తులం బంగారం వగైరా హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయలేక ప్రజలను మోసగించింది,” అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం తప్ప ఇంకేదీ అమలు కాలేదని విమర్శించారు.
తెలంగాణ వెనకడుగు
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దామని, కానీ ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “తెలంగాణ అభివృద్ధిని తిరిగి తీసుకురావడానికి మళ్లీ ముమ్మరంగా పోరాడాలి,” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సభలో ఉద్రిక్తత
ప్రసంగం మధ్యలో కొందరు కార్యకర్తలు Congress vs BRS కేకలు వేయడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. “అరిచే వాళ్లు మనవాళ్లేనా? బుద్ధి లేదా?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.







