బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన Kavitha BRS Statement ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీపై తన అసంతృప్తిని బహిరంగంగా వెలిబుచ్చారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే ఊరుకోను అంటూ ఘాటుగా స్పందించారు. పార్టీ లోపలి వ్యవహారాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కవిత, తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన లేఖను లీక్ చేసిన విషయంపై కూడా మండిపడ్డారు.
“కేసీఆర్‌కు నేను రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలి. ఇంటర్నెల్ కమ్యూనికేషన్ కోసం లేఖ రాస్తే దాన్ని బయటపెట్టడం సరికాదు” అని పేర్కొన్నారు.
అలాగే ఆమె చెప్పిన కీలక వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:
పార్టీ పనుల సగం నేనే చేస్తున్నా. కానీ నాకు విలువ ఇవ్వడం లేదు.
కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నా. ఇప్పుడు మాత్రం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఉద్యమాలు లేకుండా, సోషల్ మీడియా పోస్టులు పెట్టడమే సరిపోతుందా?
కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత సంఘర్షణను బయటపెడుతున్నాయి. పార్టీ భవిష్యత్తుపై ఆమెకు ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
ఇకనైనా నాయకులు ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజా సమస్యలతో మమేకం కావాలి” అని ఆమె సూచించారు.
కవిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ Kavitha BRS Statement రాజకీయ పరిణామాలు ఇంకెంత మలుపులు తీసుకుంటాయో చూడాలి.