Telangana Politics : kcr లాగే నేను తిక్కదాన్ని.. కవిత

Kavitha Demand KCR

బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. Telangana Politics లీడర్‌గా కేసీఆర్ ఒక్కరే అంటూ, తన లేఖ లీక్ వ్యవహారంపై స్పష్టత కోరారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన నిర్భయ స్వరంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ నా లీడర్.. ఇంకెవ్వరు నాయకుడు లేరూ” అంటూ కేటీఆర్‌ను పరోక్షంగా టార్గెట్ చేశారు. బీఆర్ఎస్‌లో ప్రస్తుతం జరుగుతున్న నాయకత్వ సంక్షోభానికి సంబంధించి తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.

“తిక్కదాన్ని.. ఎవరికీ భయపడను. 25 ఏళ్లుగా నాన్నకి లేఖలు రాస్తున్నా. ఆయన చదివి చించేస్తారు. కానీ ఈసారి నేను రాసిన లేఖ బయటికి ఎలా వచ్చింది?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యల ద్వారా లేఖ లీక్ వ్యవహారంపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. “ఈ లీక్ వెనుక ఎవరున్నారో బయటపెట్టాలి. ఇదే నా డిమాండ్” అని కవిత తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ నాయకత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించిన కవిత, Telangana Politics తన భవిష్యత్తు రాజకీయ చర్యలకు మౌలికంగా ఈ ప్రకటన నిలవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీపై ఆమె అసంతృప్తి స్పష్టంగా వ్యక్తమవుతోంది.

Leave a Comment