కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు Kamal Haasan Kannada Comment చేసిన కమల్ హాసన్ పై బీజేపీ, కన్నడ సంఘాల నుంచి తీవ్ర ప్రతిస్పందనలు. “తగ్ లైఫ్” సినిమాను నిషేధిస్తామని హెచ్చరిక.
బెంగళూరు: ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన ఒక వ్యాఖ్యతో భాషా వివాదం ముదిరింది. ఆయన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందే కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ కర్ణాటక శాఖ, కన్నడ రక్షణ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప మాట్లాడుతూ, “ఇలాంటి వ్యాఖ్యలు సంస్కారహీనతకు నిదర్శనంగా ఉన్నాయి. కమల్ హాసన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆయనకు భాషల చరిత్రపై అవగాహన లేకుండానే మాట్లాడుతున్నారు” అని మండిపడ్డారు.
కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” అంటూ మొదలుపెట్టి, వేదికపై ఉన్న కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి, “మీ భాష తమిళం నుంచే పుట్టింది” అన్నారు. ఇది కన్నడ భాషను, కన్నడిగుల గౌరవాన్ని తక్కువచేసేలా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
నిషేధానికి పిలుపు:
కన్నడ రక్షణ వేదిక నాయకుడు ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాను కర్ణాటకలో నిషేధించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే బెంగళూరులో “తగ్ లైఫ్” సినిమా పోస్టర్లను చించివేసి నిరసనలు చేపట్టారు.
తీవ్ర విమర్శలు:
“భాషల పరస్పర గౌరవం అవసరం. దక్షిణ భారతదేశంలో కలిసికట్టుగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు ప్రాంతీయ చీలికలకు దారితీస్తాయి” అని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు.
“తమిళ, కన్నడ భాషల మధ్య ఆధిపత్యం చూపే ప్రయత్నం చేయడం బాధాకరం” అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వివాదం “తగ్ లైఫ్” సినిమాపై ప్రభావం చూపే Kamal Haasan Kannada Comment అవకాశం ఉంది. కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలపై స్పందించి బేషరతుగా క్షమాపణ చెప్పారా లేదా? అనే ప్రశ్న ఇప్పుడే హాట్ టాపిక్‌గా మారింది.