నందిగామలో పూలే జయంతి Mahatma Jyotirao Phule Jayanti 2025

Mahatma Jyotirao Phule Jayanti 2025

అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే Mahatma Jyotirao Phule Jayanti 2025 కృషి : ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య Tangirala Soumya on Phule సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొనియాడారు. శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాకానీ నగర్ కార్యాలయంలో తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు మహనీయుడు పూలే కృషిచేశారని తెలిపారు. తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త పూలే అని అభివర్ణించారు. సమ సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యమని చెప్పారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు. సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం Tangirala Soumya on Phule ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం Mahatma Jyotirao Phule Jayanti 2025 అర్పించే ఘన నివాళి అని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.

Leave a Comment