Janasena Nandigama : నందిగామలో మానవహారం

Kashmir Terror Attack (2)

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ Janasena Nandigama ఆదేశాల మేరకు నందిగామలో మానవహారం నిర్వహించారు. నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, నందిగామ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటైంది.

ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ, దేశమంతా ముక్తకంఠంతో ఖండించిన ఈ దాడిలో 28 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది గాయపడినట్టు తెలిపారు. మృతుల్లో విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి, కావలి కి చెందిన జనసైనికుడు సోమిశెట్టి మధుసూదన్ రావు ఉండటం బాధాకరమన్నారు.

పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మూడు రోజుల సంతాప దినాలు పాటిస్తున్నామని, మృతుల కుటుంబాలకు మద్దతుగా నిలబడి, మనోధైర్యాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె వివరించారు. పిరికిపంద చర్యలను భారతదేశం ధీటుగా ఎదుర్కొంటుందని, దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులపై ఇండియన్ ఆర్మీAlready వేట మొదలుపెట్టిందని పేర్కొన్నారు.

గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా గారిని ఉగ్రవాదంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంపై స్పందించి కఠిన నిర్ణయాలు తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, కూటమి Janasena Nandigama నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Kashmir Terror Attack (1)
Kashmir Terror Attack (1)

Leave a Comment