influencers telugu : వీళ్లు టీచ‌ర్ల ఛీ..ఛీ…

gowthami rathod and susma bhupati

ఉపాధ్యాయులు అంటే మ‌న స‌మాజంలో చాలా గౌర‌వ ప్ర‌ధ‌మైన భావ‌న ఉంటుంది. influencers telugu త‌ల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే చ‌దువు చెప్పే గురువు త‌ర్వాతే దైవం అని క‌దా అర్థం. విద్యార్థుల‌కు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్న‌త స్థాయిలో ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేస్తారు. నేటికీ ఉపాధ్యాయులు అంటే చేతులెత్తి మొక్కెలా చాలా మంది టీచ‌ర్లు ఉన్నారు. ఇలాంటి గౌర‌వ ప్ర‌ధ‌మైన ఉద్యోగంలో అక్క‌డ‌క్క‌డా కొంద‌రు చేసే ప‌నులు చూస్తే ఇలాంటి పిచ్చి ప‌నులు చేసే వాళ్లా టీచ‌ర్లు ఛీ…ఛీ.. అంటూ కొంద‌రు బాహాటంగానే తిడుతున్నారు.

సోష‌ల్ మీడియా ప్ర‌భావం Social Media

కొంద‌రు టీచ‌ర్లు చేసేది గౌర‌వ ప్ర‌ధ‌మైన ఉద్యోగం అయిన‌ప్ప‌టికీ దానిని ప‌క్క‌న పెట్టి, ఫేం కోసం, లైకుల కోసం పిచ్చి ప‌నులు చేస్తున్నారు. వీరు చేసే ప‌నులు చూస్తే వీళ్ల‌కంటే చ‌దువుకోని వారే న‌యం అనేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. లైకుల కోసం, కామెంట్ల కోసం వీళ్లు చేసే చౌక‌బారు ప‌నులు చూస్తే మాత్రం చిర్రెత్తికొస్తుంది. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా లైకులే ప‌ర‌మావ‌ధిగా వీళ్లు ఎవ‌రి మాట విన‌కుండా వారికిష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. వీళ్లు చేసే వీడియోలు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎందుకు ఈ మాట‌లు చెప్పాల్సి వ‌చ్చిందో… పిచ్చి పిచ్చి వీడియోల‌తో జ‌నాల‌కు చిర్రెత్తెలా చేసే వీళ్లు నెటిజ‌న్లు కామెంట్లు చేసి తిట్టినా ప‌ట్టించుకోరు. ఎందుకంటే వారికి కావాల్సింది ఫేం కాబ‌ట్టి..

గ‌ర్వం త‌ల‌కెక్కితే ఇంతేనా…

ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాల‌ని చెబుతారు మ‌న పెద్ద‌లు. అలాంటిది ఒక్క రోజులో వీరికి ఫేం వ‌స్తే చాలు తాము సినీ సెల‌బ్రీటీల‌కు ఏ మాత్రం తీసిపోము అంటూ బిల్డ‌ప్‌లు కొడ‌తారు. సోష‌న్ మీడియా పుణ్య‌మా అని చాలా మంది రాత్రికి రాత్రే ఫేమ‌స్ అయిన వాళ్లు ఉన్నారు. దానిని అడ్డం పెట్టుకుని వీళ్లు చేసే వెకిలి వీడియెలు అంతా ఇంతా కాదు. కోతికి కిబ్బ‌రి తిప్ప దొరికిన చందంగా వీళ్ల వ్య‌వ‌హార శైలి ఉంటుంది.

డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్య‌మా.. Money Earnings

రాత్రికి రాత్రి వ‌చ్చిన ఫేంని అడ్డంపెట్టుకుని వీళ్ల సంపాద‌న ఉంటుంది. దాని కోసం ఎలాంటి ప‌నులు చేయ‌డానికి అయినా వెన‌కాడ‌రు. మేము టీచ‌ర్లం అని మ‌ర్చిపోయి రోడ్డు మీద డ్యాన్సులు వేయ‌డం, వెకిలి చేష్ట‌లు చేయడం చేస్తారు. బ‌య‌ట‌కు మాములుగా మాట్లాడుతున్న‌ట్లు క‌ల‌రింగ్‌ ఇస్తారు. కానీ వీళ్ల మాట‌లు వింటే ధ్వంద అర్థాలు వ‌చ్చే విధంగా ఉంటాయి. ఇవి కుర్ర‌కారుని రెచ్చ‌గొట్టే విధంగా ఉంటాయి. డ‌బ్బ‌లు సంపాదించ‌డం అంటే వీరి బాష‌లో ప్ర‌మోష‌న్లు అన్న‌మాట‌.. అవి చేయ‌డం కోసం ఎంత‌కైనా తెగిస్తారు. ఉన్న‌వి లేనివి అబ్బ‌ద్దాలు చెప్పి కంపెనీ య‌జ‌మానుల మెప్పు పొందెలా చేస్తారు. చీర‌ల‌కు, ఆభ‌ర‌ణాల‌కు అల‌వాటు ప‌డి అస‌భ్యంగా వీడియోలు చేస్తారు.

నెటిజ‌న్ల కామెంట్లే వీళ్ల‌కు పెట్టుబ‌డి.. Trollers 

ఎవ‌రైనా ఒక్క‌సారి చెబితే వింటారు. కానీ చెప్పినా విన‌ని వారే వీళ్లు. ఎంత చెబితే అంత రెచ్చిపోతారు. ఎవ‌రైనా వీళ్ల‌ను తిడితే చాలు.. త‌ప్ప‌ని చెబితే చాలు.. చూడ‌కండి. ఎవ‌రు చూడ‌మ‌న్నారు. బ్లాక్ చేసుకోండి. అంటూ ఘాటుగా స్పందిస్తారు. వాటిని కూడా వీడియోలుగా చేసి మ‌ళ్లీ లైకులు కామెంట్లు సంపాదిస్తారు.

నిజ‌మైన ఉనాద్యాయుల‌కు హ్యాట్సాఫ్‌ True Teachers 

ఇప్ప‌టికీ స‌రిగ్గా ఫోన్ వాడ‌లేని ఉపాధ్యాయులు ఉన్నారంటే న‌మ్ముతారా.. ఇప్ప‌టికీ సామాజిక మాధ్య‌మాల గురించి పూర్తిగా తెలియ‌ని టీచ‌ర్లు ఉన్నారంటే న‌మ్ముతారా.. అవును అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్ప‌టికీ ఉద‌యం స్కూలు, సాయంత్రం ట్యూష‌న్లు చెప్పి విద్య‌ర్థుల భ‌విష్య‌త్‌కు బంగారు బాటలు వేస్తున్న టీచ‌ర్లు చాలా మంది ఉన్నారు. ఎంతోమంది విద్యార్థ‌లు చ‌ద‌వుకోవ‌డానికి డ‌బ్బ‌లు లేకపోతే వారి జీతం డ‌బ్బుల నుంచి చ‌దివిస్తున్న వారు ఉన్నారు. ఎప్పుడో చ‌దువుకున్న విద్యార్థులు త‌మ ఉపాధ్యాయులు క‌న‌బ‌డ‌గానే మాస్టారు నేను మీ స్టూడెంట్‌ని అని అప్యాయంగా ప‌ల‌క‌రించేలా చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ కొంద‌రు టీచ‌ర్ల ముసుగులో డ‌బ్బుల సంపాద‌న‌లో.. ఫేం కోసం పాకులాడే వారు ఏం సందేశం ఇస్తారు. రేపు మిమ్మ‌ల్ని influencers telugu ఏమ‌ని గౌర‌విస్తారు. ఏమ‌ని మాట్లాడ‌తారు… ఒక్క‌సారి ఆలోచించండి…

garuda netram nigha varthalu
garuda netram nigha varthalu

Leave a Comment