కోలారు జిల్లాలో హెచ్-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని Helicopter Manufacturing India ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. మొదటిగా 10 యూనిట్లు, తదుపరి 20 ఏళ్లలో 500 వరకు హెలికాప్టర్లు తయారవుతాయన్నారు.
బెంగళూరు: భారత్‌లో హెలికాప్టర్ల తయారీలో కీలక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్‌లో ఏర్పాటుకానుంది. ప్రముఖ అంతర్జాతీయ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ మరియు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సంయుక్తంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ కేంద్రంలో తేలికపాటి హెచ్-125 హెలికాప్టర్లు తయారవుతాయి. మొదటిగా 10 యూనిట్లను ఉత్పత్తి చేసి, తదుపరి 20 సంవత్సరాల వ్యవధిలో 500 హెలికాప్టర్లు తయారు చేయడం లక్ష్యంగా ఉంది. తయారైన హెలికాప్టర్లను భారత ఆర్మీకి, సివిల్ అవసరాలకు మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
భారత్‌లో ఎయిర్‌బస్ శ్రేణిలో హెచ్-125 తయారీ కేంద్రం స్థాపిస్తున్న నాల్గో దేశంగా అవతరించనుంది, ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.
కర్ణాటకకే ఎందుకు ప్రాధాన్యత?
హెలికాప్టర్ల తయారీకి కర్ణాటకను ఎంచుకోవడానికి ప్రధాన కారణం–
స్థిరపడిన ఏరోస్పేస్ తయారీ మౌలిక సదుపాయాలు
టాటా గ్రూప్ ఇప్పటికే వేమగల్ పారిశ్రామిక వాడలో 7.4 లక్షల చదరపు అడుగుల భూమిని పొందిన విషయం
ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ క్లియరెన్స్, పన్ను మినహాయింపులు, విద్యుత్ సబ్సిడీలు, 1% ఉత్పత్తి ప్రోత్సాహకాల వంటి విధానాలు అందిస్తోంది
టాటా సీఈఓ వ్యాఖ్య:
“భారతదేశంలో హెచ్-125 హెలికాప్టర్ల తుది అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ తయారీ సామర్థ్యాలు పెరిగి పౌర విమానయాన అభివృద్ధికి తోడ్పడతాయి” అని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరణ్ సింగ్ పేర్కొన్నారు.
ఇదే కాకుండా, టాటా – ఎయిర్‌బస్ భాగస్వామ్యంలో Helicopter Manufacturing India గుజరాత్ వడోదరలో సీ-295 విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటు ప్రణాళిక కూడా ఉన్నట్లు సమాచారం.