10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తరుణంలో తిరుమలకు TTD News భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా దైవ దర్శనానికి పరిక్షలు అయిపోయిన విద్యార్థలు వారి తల్లిదండ్రులలో పాటు తిరుమల తిరుపతి వెళ్లే అవకాశం ఉంది. తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఇలా చేస్తే మీకు త్వరగా దర్శనం అయ్యే అవకాశం ఉంది. మీకు 300 రూపాయలు టికెట్లు కనుక లేకపోతే వెంటనే ఈ కింద చెప్పిన విధంగా చేయండి మీకు దర్శనం 3 నుంచి 5 గంటల్లోనే కంప్లీట్ అవుతుంది.
SSD Tokens:- తిరుపతిలో రాత్రి 9 గంటల నుంచి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు. అవి ఇచ్చే ప్రదేశాలు
🔔 శ్రీనివాసం – RTCబస్టాండ్ దగ్గర
🔔 విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా
🔔 భూదేవి కాంప్లెక్స్ – అలిపిరి దగ్గర
SSD టోకెన్లు తిరుపతిలో 10,000 టికెట్స్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు టికెట్లు ఇవ్వడం మొదలవుతుంది శ్రీనివాసం బస్టాండ్ దగ్గర, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు కౌంటర్లలో SSD టోకెన్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్లు పొందిన భక్తులు మూడు నుంచి నాలుగు గంటల్లో దర్శనం పొందే అవకాశం ఉంటుంది. కావునా భక్తలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
తిరుమల వెళ్లే భక్తలు ఈ క్రింది ఇవ్వబడిన వాటిని తమ వెంట తప్పకుండా ఉంచుకోవలెను. ఆధార్ కార్డు జిరాక్స్ ప్రింట్ ఉంటేనే టికెట్ ఇస్తారు. ఫోన్ లో ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇవ్వరు. భక్తులు గమనించగలరు.సంబంధించిన రోజు టికెట్ల కోట కంప్లీట్ (TTD News)అయితే టికెట్స్ ఇవ్వటం ఆపుతారు భక్తులు గమనించగలరు.