ఏపీకి చెందిన ఓ కంపెనీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.. రేవ్ పార్టీలో మహిళల అసభ్య నృత్యాలు.. కొన్ని Hyderabad rave party అనుమానాస్పద వస్తువులు కూడా లభ్యం. హైదరాబాద్ మహేశ్వరం శివారులో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఫర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీలో 50 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి లిక్కర్, మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైద్రాబాద్ రాజధాని శివారులో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. మహేశ్వరం మండలంలోని కే. చంద్రారెడ్డి రిసార్ట్‌లో జరిగిన రేవ్ పార్టీపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ నిర్వహించిన పార్టీ అని పోలీసులు గుర్తించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన డీలర్ల కోసం ఆ కంపెనీ ప్రత్యేకంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. పోలీసులు రిసార్ట్‌లోకి చొచ్చుకెళ్లి తనిఖీలు చేయగా, 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. పార్టీలో మద్యం సదుపాయాలు ఉన్నట్లు, కొన్ని అనుమానాస్పద వస్తువులు కూడా లభించాయని అధికారులు తెలిపారు. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపారు. రిసార్ట్ యజమాని, నిర్వాహకులపై విచారణ జరుపుతున్నారు. లిక్కర్ బాటిల్స్, సౌండ్ సిస్టమ్స్, పార్టీ పాస్‌లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొన్నిరోజులుగా ఇలాంటి రేవ్ పార్టీలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) ఆధ్వర్యంలో ఈ దాడులు జరిపినట్లు సమాచారం. అయితే ఏపీకి చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ తమ ఉద్యోగులను, డీలర్లకు ఆనందం కలిగించాలని ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో అనేక మంది మహిళలు ఉన్నారు. వారితో అసభ్య నృత్యాలు చేయించినట్లు సమాచారం. దీనిపై అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఇంకా అనుమానస్పదంగా దొరిగిన వస్తువులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫర్టిలైజర్ కంపెనీ ఎవరిది అనేది పోలీసులు ఇప్పటి వరకు గోప్యంగా ఉంచాలి చూడాలి మరి వివరాలు విచారణ అనంతరం తెలిసే Hyderabad rave party అవకాశం ఉంది.





