పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రేక్షకులను నిరాశపరిచింది. బలహీనమైన Harihara Veeramallu Review సెకండ్ హాఫ్, ఘోరమైన గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ట్రోల్ మెటీరియల్‌గా మిగిలింది.
సినిమా చూసిన ఒక అభిమాని తన మనసులోని మాటను ఇలా చెప్పాడు. ఇది అభిమాని రివ్యూ. హరిహర వీరమల్లు రివ్యూ: పూర్ గ్రాఫిక్స్‌కు బలి అయిన సినిమా. కర్ణుడి చావుకి లక్ష కారణాలు అంటారు… హరిహర వీరమల్లు సినిమా విషయంలోనూ ఇదే అనిపిస్తుంది.
ఇన్నాళ్లు ఎదురు చూసిన సినిమా ఇది కాదు. 30 రోజుల షూట్‌ను 3 రోజుల్లో ఒరిగించేందుకు ప్రయత్నించడమే సినిమా బలహీనతలకు మూలకారణం. షూటింగ్ పరంగా తీసిన నిర్లక్ష్యం, ప్రాజెక్ట్ మీద ఉన్న స్థిరతలేమి, మరియు ముఖ్యంగా గ్రాఫిక్స్ పనితీరు – ఇవన్నీ కలిసి ఈ సినిమాను ప్రేక్షకుల చేత “ట్రోల్ మెటీరియల్”గా మార్చేశాయి.
ఫస్టాఫ్ ఓకే… కానీ సెకండాఫ్?
ఫస్టాఫ్ చూసిన తర్వాత “ఏదో ట్రై చేశాడు, అలా ఘోరంగా లేదు” అనిపిస్తుంది. కానీ… సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాతే అసలు నిరాశ మొదలవుతుంది. గ్రాఫిక్స్ అంత దారుణంగా ఉన్నాయంటే, వాస్తవానికి కొన్ని మంచి సన్నివేశాలే నాశనం అయ్యాయి. కథ ఎటు పోతుందో తెలియదు. ప్రతి సీన్‌లో ఓ కష్టం, ఆ వెంటనే సొల్యూషన్ – కథ పేసింగ్ పూర్తిగా మిస్ అయింది.
గ్రాఫిక్స్ – సినిమాకే గండికొట్టిన విభాగం
ఈ రోజుల్లో చిన్న సినిమాలు కూడా అద్భుతమైన CG వర్క్‌తో వస్తున్నాయి. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి విజువల్స్ అనేది పూర్తిగా నిరాశపరచే విషయం. ఇది దర్శక నిర్మాతల తప్పే కాకుండా, పవన్ కల్యాణ్ కూడా సమయం ఇవ్వకపోవడం వల్లే అని అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు.
నటన, సంగీతం, టెక్నికల్ విభాగాలు
పవన్ కళ్యాణ్ నటనలో ఆయనకి దక్కిన ‘స్వాగ్’ కనిపిస్తుంది. కానీ అది చాలు అన్నట్టుగా మిగిలిన పాత్రలు, అభినయాలు చెప్పుకునేంతగా లేవు. కీరవాణి సంగీతం ఓకే స్థాయిలో ఉంది. కానీ అది సినిమా క్వాలిటీని నిలబెట్టలేకపోయింది.

చివరిగా..
హరిహర వీరమల్లు – ఒక మంచి అంశం (హిందూ ధర్మ రక్షణ) ఉన్నా, దాన్ని పట్టుకుని ముందుకెళ్లే స్థిరమైన కథ, టెక్నికల్ స్ట్రాంగ్ ట్రీట్మెంట్ లేకపోవడంతో బలైంది. గ్రాఫిక్స్ లోపం ఈ సినిమాని తీవ్రంగా దెబ్బతీసింది. అభిమానిగా చెప్పాల్సిన Harihara Veeramallu Review బాధాకరమైన నిజం – ఈ సినిమా రిలీజ్ కాకపోయినా బాగుండేది!