ఢిల్లీ పాతబస్తీ ఫతే దర్వాజా వద్ద జుట్టు పెరుగుతుందంటూ క్యూ కట్టిన యువకులు. కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న Hair growth scam బాధితులు.
బట్టతలపై జుట్టు పెరుగుతుందంటూ మోసం –ఢిల్లీలో షాకింగ్ ఘటన
ఢిల్లీకి చెందిన పాతబస్తీ ఫతే దర్వాజా ప్రాంతంలో వందలాది మంది యువకులు బట్టతల సమస్యకు పరిష్కారం ఉందంటూ క్యూ కట్టారు. “జుట్టు రాలిపోయిన Hair regrowth వాళ్లకి మళ్లీ జుట్టు మొలుస్తుంది” అంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రచారం వల్ల ఈ తతంగం జరిగింది.
బిగ్‌బాస్ పార్టిసిపెంట్ పేరు వాడి ప్రచారం
ఢిల్లీకి చెందిన ఓ బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కు జుట్టు మొలిపించానంటూ షకీల్ భాయ్ అనే వ్యక్తి తన ప్రమోషన్‌ను తెగ వైరల్ చేశాడు.. దీనిని చూసి జుట్టులేని వాళ్లు తెగ ఆనందం పడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలు, ఫోటోలు చూసి నమ్మిన యువకులు ఒకేరోజు వందల సంఖ్యలో ఆ ప్రాంతానికి పోటెత్తారు.
గుండు గీసి కెమికల్స్ రాసి…
ప్రత్యేకమైన మందులు ఉన్నాయంటూ, గుండు Baldness treatment fraud గీసి కెమికల్స్ రాసిన షకీల్ భాయ్, కొద్ది రోజుల్లో జుట్టు పెరుగుతుందంటూ హామీ ఇచ్చాడు. కానీ కొన్ని రోజుల్లోనే బాధితుల్లో తలనొప్పి, చర్మ వ్యాధులు, అలర్జీలు మొదలయ్యాయి. కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు.
ఆసుపత్రుల బారిన పడుతున్న యువత
బట్టతలపై జుట్టు పెరుగుతుందనే ఆశతో వెళ్ళిన యువకులు ఇప్పుడు మోసపోయామంటూ Hair growth scam ఫిర్యాదులు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితులు “మాకు చెప్పినట్లుగా పని చేయలేదు. అందరికీ ఇది హెచ్చరికగా ఉండాలి” అంటూ తెలిపారు.
పోలీసుల దృష్టికి కేసు
ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసుల దృష్టికి వెళ్లగా, షకీల్ భాయ్‌పై విచారణ ప్రారంభమైంది. అతను వాడుతున్న కెమికల్స్‌పై ఫోరెన్సిక్ పరీక్షలు చేయనున్నారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని Hair growth scam హెచ్చరిస్తున్నారు.

మీకు ఇలాంటి అనుభవం ఉందా? లేదా మీ ప్రాంతంలో ఏవరికైనా జరిగిందా అయితే కామెంట్‌లో పంచుకోండి. మిగతావారిని కూడా అప్రమత్తం చేయండి.