మూఢనమ్మకాలతో కన్న మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో Guntur Crime హీటర్‌తో వాత పెట్టిన దారుణ ఘటన గుంటూరు జిల్లా నెహ్రూనగర్‌లో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా నెహ్రూ నగర్‌లో మానవత్వాన్ని కలిచివేసే దారుణం జరిగింది. మూఢనమ్మకాలు, ఇతరుల మాటలు విని ఏడాదిన్నర వయసున్న మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ, అతడిని చిత్తుగా కాల్చేసింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాడి:
ఈ దారుణ ఘటన నెహ్రూనగర్‌లో వెలుగు చూసింది. బాధిత బాలుడి తల్లిదండ్రులు కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ చిన్నారి పుట్టిన కొద్దీ రోజుల్లోనే పెదనాన్న మరణించడంతో, బాలుడి జాతకమే కారణమని కొందరు చెప్పిన మాటలు నాయనమ్మ తలకెక్కించుకుంది. అప్పటి నుంచీ బాలుడిపై కోపంతో ఉన్న నాయనమ్మ, ఒక రోజు ఇంట్లో ఎవ్వరి లేని సమయంలో పొయ్యి మంటలపై బాలుడి చేయి ఉంచి కాల్చింది.
వైద్యుల సూచనతో అసలు విషయం వెలుగు:
నాయనమ్మ హీటర్ పట్టుకున్నట్టు కథ కలిపి, బాలుడి చేయి అలా కాలిందని చెప్పింది. అయితే వైద్యులు హీటర్ వల్ల ఇలాంటివి జరగవని, బలవంతంగా కాల్చినట్టు కనిపిస్తోందని అన్నారు. దీంతో తండ్రి తల్లిని నిలదీయగా ఆమె నిజాన్ని ఒప్పుకుంది.
కుటుంబం పోలీస్ కేసు నివారణకు ప్రయత్నం:
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. బయటకు పొక్కితే తల్లి అరెస్ట్ అవుతుందన్న భయంతో కుమారుడు ఫిర్యాదు చేయలేదని సమాచారం. ప్రస్తుతం బాలుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. పిల్లలపై ఇలా హింసచేయడం Guntur Crime నేరమని, మానవహక్కుల సంఘాలు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.