Pakistani Temple Telugu Music : పాకిస్థాన్లో ఘంటసాల పాట.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వీడియోతో వెలుగులోకి!

Ghantasala Song Pakistan

జ్యోతి మల్హోత్రా వీడియోలో పాకిస్థాన్ కటాస్‌రాజ్ ఆలయంలో ఘంటసాల గళంలో ‘ Pakistani Temple Telugu Music రాముని అవతారం’ పాట వినిపించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.

ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న దృశ్యం

తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారిన వీడియో

గూఢచర్యం ఆరోపణలపై యూట్యూబర్ అరెస్ట్

పొరుగు దేశం పాకిస్థాన్‌లోని ఓ ప్రాచీన ఆలయంలో గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన అచ్చ తెలుగు పాట వినిపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. గూఢచర్యం ఆరోపణలతో ఇటీవల అరెస్టయిన భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గతంలో చిత్రీకరించిన ఓ వీడియో ద్వారా ఈ ఆసక్తికర దృశ్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తెలుగువారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సుమారు రెండు నెలల క్రితం పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ కటాస్‌రాజ్‌ ఆలయ సముదాయాన్ని సందర్శించింది. ఆ పర్యటనలో భాగంగా ఆలయ విశిష్టతను వివరిస్తూ ఆమె ఓ వీడియోను చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలో 6 నిమిషాల 50 సెకన్ల వద్ద జ్యోతి మల్హోత్రా కటాస్‌రాజ్‌ ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వైపు వెళుతుండగా ఓ అద్భుతం చోటుచేసుకుంది.

ఆలయం లోపలి నుంచి ఎవరో ఒక వ్యక్తి అత్యంత మధురంగా, భక్తిశ్రద్ధలతో ఓ తెలుగు సినిమా పాటను పాడుతుండటం స్పష్టంగా వినిపించింది. మన ఘంటసాల మాస్టారు పాడిన ‘భూకైలాస్’ చిత్రంలోని ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం’ అనే సుప్రసిద్ధ గీతం. ఆలయంలో కూర్చుని ఓ పెద్దాయన ఈ పాటను ఆర్తితో ఆలపిస్తున్న దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. పరాయి దేశంలో, అందులోనూ పాకిస్థాన్‌లో మన తెలుగు పాట, అదీ ఘంటసాల గళమాధుర్యాన్ని గుర్తుకుతెచ్చేలా ఓ వ్యక్తి పాడుతుండటం తెలుగువారందరినీ ఆకట్టుకుంటోంది

వైరల్ అవుతున్న వీడియో

జ్యోతి మల్హోత్రా ఇటీవల గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ కావడంతో ఆమె యూట్యూబ్ ఛానల్‌లోని వీడియోలపై చాలామంది దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కటాస్‌రాజ్‌ ఆలయ వీడియోలోని ఈ అరుదైన ఘట్టం బయటకు వచ్చి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. దేశాలు వేరైనా, భాషలు వేరైనా సంగీతానికి, ముఖ్యంగా మన ఘంటసాల పాటలకు సరిహద్దులు లేవని ఈ సంఘటన నిరూపిస్తోందని Pakistani Temple Telugu Music నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వేరే దేశంలో తెలుగు పాట వినడమే గొప్ప అనుభూతి అయితే, పాకిస్థాన్‌లో ఘంటసాల పాట వినడం నిజంగా ఓ అద్భుతమని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Comment