Fatehpur fire accident : బాణసంచా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం – 70 షాపులు, 50 వాహనాలు దగ్ధం

FatehpurFire

ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్): దీపావళి వేళ విషాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ Fatehpur fire accident జిల్లాలో బాణసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగి 70కి పైగా షాపులు, 50 వాహనాలు మంటల బారిన పడ్డాయి. సెలబ్రేషన్‌కు సిద్ధమైన మార్కెట్ ఒక్కసారిగా మంటల్లో కూరుకుపోవడంతో ప్రాంతం మొత్తం కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాపారులు తమ సామాన్లు కాపాడుకునే అవకాశం లేకుండా పోయింది.

₹3 కోట్లకు పైగా ఆస్తినష్టం

అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ అగ్ని ప్రమాదంలో రూ.3 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు తెలిపారు.
అదే సమయంలో బాణసంచా స్టాల్స్ పక్కన నిలిపి ఉంచిన 50 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రత వల్ల మార్కెట్ చుట్టుపక్కల భవనాలకు కూడా ప్రమాదం ఏర్పడింది.

గాయపడిన పలువురు ఆసుపత్రిలో మంటల్లో చిక్కుకున్న పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించారు.

విచారణకు ఆదేశాలు

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. బాణసంచా మార్కెట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీపావళి ముందు ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ఉండేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.

ప్రజలకు హెచ్చరిక

దీపావళి వేళ ఇలాంటి విషాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని Fatehpur fire accident అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సెలబ్రేషన్స్‌లో నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు.

Leave a Comment