అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరీక్షిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ DSC Notification 2025 పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఐదు రోజుల్లో 16,347 పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఐటి, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతోనే డీఎస్సీ ఆలస్యమైందని, నిన్న క్యాబినెట్ ఆమోదించిన ఎస్సీ కమిషన్ నివేదికపై రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
ఈ ప్రకటన మంత్రి లోకేష్ “షైనింగ్ స్టార్స్ – 2025” అనే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఇంటర్, వొకేషనల్ కాలేజీల్లో రాష్ట్రస్థాయిలో టాప్ మార్కులు సాధించిన 52 మంది విద్యార్థులను గోల్డ్ మెడల్స్ మరియు ల్యాప్‌టాప్స్ తో సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మీరు ప్రభుత్వ విద్యకు గుర్తింపు తెచ్చారు. మీ విజయాలు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. మా లక్ష్యం ఎవరు పేదరికం కారణంగా DSC Notification 2025 చదువుకు దూరం కాకుండా చూడటం,” అని లోకేష్ చెప్పారు.