మహిళలకు facebook ద్వారా అసభ్య msgలు పంపుతున్న వ్యక్తిని అదే దారిలో వెళ్ళి చాకచక్యంగా పట్టుకున్నMachilipatnam వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది అంటే..
మచిలీపట్నం కు చెందిన రాంబాబు అనే వ్యక్తి face book మరియు మెసెంజర్ ద్వారా అసభ్యంగా మహిళలకు మెసేజెస్ పెట్టి వాళ్లని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ మోసం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డా.అమ్మిరెడ్డి రజనీ అదే దారిలో వెళ్ళి అతనికి బుద్ధి చెప్పారు.
ఎలా పట్టుకున్నారు?
అతను మహిళలను ఏ విధంగా మోసం చేశాడో అదే విధంగా facebook మెసెంజర్ ద్వారా సందేశం పంపి మాటలు కలిపారు. ఒకచోట కలవాలని చెప్పారు. అతనికి చెప్పాల్సింది చెప్పి. చాకచక్యంగా రాంబాబుని ఆఫీసుకి పిలిపించి ప్రూఫ్స్ తో సహా చిలకలపూడి పోలీసులకు అప్పగించారు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తం ఉండాలి : డా.అమ్మిరెడ్డి రజనీ
ఈరోజుల్లో సైబర్ నేరాల వల్ల అనేక మంది ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది అన్నారు. మహిళల పట్ల ఇవి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రాంబాబు లాంటి వ్యక్తులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారన్నారు. తెలియని వ్యక్తుల నుంచి సందేశం వస్తే వాటికి స్పందించవద్దని తెలిపారు. కేవలం వీటి వల్ల అవగాహన ఉంటే తప్పా వీటి భారినుంచి తప్పించుకోలేమన్నారు. ఎవరికివారు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు. రాంబాబుపై తగిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
జాగ్రత్తగా ఉండండి
తెలియని వ్యక్తుల నుంచి సందేశం వస్తే వెంటనే బ్లాక్ చేయడం ఉత్తమం. సామాజిక మాధ్యమాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎవరైన హాయ్, హలో అనే సందేశాలు పంపితే వెంటనే డిలిట్ చేసి బ్లాక్ చేయండి. అంతేకాదు తెలియని వ్యక్తల నుంచి లింక్‌లు వచ్చినా Machilipatnam వాటిపై అస్సలు క్లిక్ చేయోద్దు. సామాజిక మాద్యమాల నుంచి సందేశాలు అంటే మీకు తలిసిన పేరుతో అయినా సరే నాకు డబ్బులు పంపండి నేను మళ్లీ ఇస్తాను అని ఎవరైనా అడిగినా వాటికి రిప్లై ఇవ్వకండి. సామాజిక మాధ్యమాల గురించి ఎప్పటికప్పడు అప్పమత్తంగా ఉండండి.
