ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
కలెక్టర్‌తో కలిసి స్థల పరిశీలన
విజయవంతం చేయాలని పిలుపు
చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఈనెల 5వ తారీకున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.
ఈనెల 5న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముప్పాళ్ళ గ్రామానికి రానున్నారని. బాబు జగజ్జివన్ రావు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొంటున్నారని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు స్థలాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మరియు కూటమినేతలతో కలసి పరిశీలించారు. చంద్రబాబు యుడు గారి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై అధికారులు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. గ్రామంలోని దేవాలయాలు, ఖాళీ స్థలాలను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నందిగామ నియోజకవర్గం మొదటిసారిగా చంద్రబాబు నాయుడు వస్తున్న తరుణంలో ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సభ గ్రామంలో ఎక్కడ పెడితే బాగుంటుందని కలెక్టర్ లక్ష్మిశ కూటమినేతలతో కలసి మంగళవారం గ్రామ సమీపంలో భూములను పరిశీలించామని ఆమె తెలిపారు.
నందిగామ వార్తల కోసం చూస్తునే ఉండండి.
