నందిగామ న్యూస్ : ఈ నెల 5వ తేదీన చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గానికి విచ్చేయనున్న AP News సందర్భంగా సమన్వయ కమిటీ మరియు ముఖ్యనేతలతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నా తరువాత మొట్టమొదటి సారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడునియోజకవర్గానికి రావటం చాలా సంతోషం. శనివారం ఉదయం ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటారు. పల్లెటూరులో పేద ప్రజలు సైతం పైకి రావాలని భాగస్వాములు ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం చేస్తూ బంగారు కుటుంబాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వం లక్ష్యం అని ఆ దిశగా రాష్ట్రమంతటా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.