ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తన సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8:51 గంటలకు కుటుంబ సభ్యులతో Ap letest news కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుకనున్న ఈ-9 రోడ్డులో ఉన్న 5.25 ఎకరాల భూమిలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. ఈ భూమిని ఒక రైతు నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే భూమి చదును పనులు పూర్తయ్యాయి. ఈ భవనం జీ ప్లస్ వన్ (G+1) తరహాలో ఉండనుందని తెలిసింది. వచ్చే ఏడాదిలోపే గృహప్రవేశంAp letest news జరగే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇంటి నిర్మాణం ద్వారా చంద్రబాబు రాజధాని అభివృద్ధిపై గట్టి సంకేతం ఇస్తున్నారని విశ్లేషణలు కొనసాగుతున్నాయి. GarudaNetram.com తో మీకు తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర సమాచారం.
