చైనాలో మరో ఇంజినీరింగ్ అద్భుతం: Engineering Wonder

Huajiang Bridge

చైనాలో బీపన్ నదిపై రూ.2400 కోట్ల వ్యయంతో 2050 అడుగుల ఎత్తులో Engineering Wonder హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్ నిర్మించబడింది. ఇది ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది.

చైనాలో మరో ప్రపంచ రికార్డు స్థాయి నిర్మాణం నిలిచింది. గుయ్ ప్రాంతంలోని బీపన్ నదిపై నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్ (Huajiang Grand Canyon Bridge) ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది. ఇది భూమి పై నుండి సుమారు 2050 అడుగుల ఎత్తులో ఉంది అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా ఉంటుంది.

ఈ వంతెన మొత్తం రెండు మైళ్ల (సుమారు 3.2 కిలోమీటర్లు) పొడవుతో నిర్మించబడింది. దీని వల్ల ప్రయాణ సమయం ఒక గంట నుండి కేవలం కొన్ని నిమిషాలకు తగ్గనుంది. ఇది తూర్పు చైనాలోని ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను మరింత వేగవంతం చేయనుంది.

ఈ వంతెన నిర్మాణానికి చైనా ప్రభుత్వం రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. అత్యాధునిక సాంకేతికతతో, ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్య నిర్మించిన ఈ వంతెన ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణించబడుతోంది. ఈ వంతెనను 2025 జూన్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. Engineering Wonder ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించబోతోంది.

Leave a Comment