ముంబయి-చెన్నై చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌లో అనంతపురం దగ్గర భారీ train robbery 2025 దోపిడీ. సిగ్నల్ కేబుల్ కత్తిరించి దుండగులు దాడి. ప్రయాణికుల వద్ద డబ్బు, బంగారం లూటీ.
అనంతపురం జిల్లా: దేశంలోని రైలు ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తే ఘటన చోటుచేసుకుంది. ముంబయి నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ లో అనంతపురం జిల్లా కోమలి స్టేషన్ సమీపంలో భారీ దోపిడీ జరిగింది.
పక్కా ప్లాన్‌తో దాడి..
దుండగులు ముందే సిగ్నల్ కేబుల్‌ను కత్తిరించి, రైలును ఆపేశారు. ఈ క్రమంలో రాత్రి చీకటిలో బోగీలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించారు. కొన్ని బోగీల్లో తుపాకులతో బెదిరింపులు, చేతిలో ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలు లూటీ చేశారు.
బాధితుల ఫిర్యాదు..
వేగంగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. అనంతరం వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై రైల్వే భద్రతా దళాలు (RPF), స్థానిక పోలీస్ విభాగాలు దర్యాప్తు ప్రారంభించాయి.
భద్రతపై ఆందోళన
ఈ దోపిడీ ఘటనతో పాటు సిగ్నల్ కేబుల్ కత్తిరించడం వంటి యాక్ట్‌లపై రైల్వే శాఖ తీవ్రంగా స్పందించనుంది. గతంలో ఇదే తరహా దాడుల నేపథ్యంలో రైళ్ల భద్రతపై train robbery 2025 అధికారులు మళ్లీ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.