అమ్మా.. భారతీ… నీ కాళ్లు పట్టుకుంటా… నేను చేసింది ముమ్మాటికీ తప్పే.. (ebrolukiranch) నన్ను క్షమించు.. నేను క్షణికావేశంలో అలా మాట్లాడాను. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారు. దయచేసి నన్ను క్షమించండి. నేను అలా మాట్లాడి ఉండకూడదు. అంటూ ఒక వీడియో రిలీజు చేసి క్షమించమని కోరాడు చేబ్రోలు కిరణ్..
ఏపీలో రాజకీయాలు వ్యక్తిగత దూషణల వరకు వెళుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య రాజకీయాల్లోకి మహిళలను లాగుతూ వారి వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇంటర్యుల ముసుగులో వాళ్లకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏదీ నిజం ఏదీ ఆబద్దం అని తెలుసుకోకుండా, ఏదీ మీడియా ముందు మాట్లాడాలి, ఏదీ మాట్లాడకూడదు అని విచక్షణ లేకుండా కొందరు ఫేమ్ కోసం ఏదీ పడితే అది మాట్లాడుతున్నారు. దీనిలో భాగంగా చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఓ య్యూటూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్యులో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిపై పలు జుబుస్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత జీవితంపై బురదజల్లె ప్రయత్నం చేశాడు.
అసలు ఏం జరిగిందంటే..
ఓ య్యూటూబ్ చానల్‌కు ఇంటర్యు ఇచ్చాడు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి. అక్కడ ఇంటర్యూ చేస్తున్న అతను పోలీసులను బట్టలు ఊడదీసి కొడతా అన్నారు కదా జగన్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. దానికి సమాధానంగా వైఎస్ భారతిపై అనుచిత వ్యాక్యలు చేశాడు. రాయడానికి వీలులేని భాషలో అతను మాట్లాడాడు. వ్యక్తిగత హవనం చేశాడు. ఒక మాజీ సీఎం భార్య, ఒక పత్రికకు చైర్మన్ అయిన ఆమెపై అసభ్య కామెంట్లు చేశాడు.
ప్రముఖులు ఏం అంటున్నారు అంటే..
రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి, వ్యాఖ్యలు సముచితంగా ఉండాలి. అంతేగాని ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడితే అది వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సోషల్ మీడియాలో ఫేం కోసం కొందరు ఇలా ప్రవర్తించడం బాధాకరమని, తరువాతి పరిణామాల గురించి ఆలోచించుకోవాలని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ పార్టీవారు కూడా సమర్థించరని అన్నారు.
పార్టీ కార్యకర్తలనుంచి ఒత్తిడి
చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిపై మాట్లాడిన వీడియో బయటకు వచ్చిన దగ్గరి నుంచి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఒక గంట వ్యవధిలోనే అతను క్షమించమని వీడియో చేశాడంటే అతనిపై ఎంత వ్యతిరేఖత, ఒత్తడి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు చేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోలేవు అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మరి చూడాలి చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటారా.. లేదా కేసులు పెడతారా.. చూడాలి.

యాంకర్‌పై కూడా చర్యలు తీసుకోవాలి
చెబ్రోలు కిరణ్ మాట్లాడితే ఇతనికి ఏం అయింది. ఒక యాంకర్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. లేదా ఆ వీడియోలో వున్న వ్యాఖ్యలను కట్ చేయాలి. లేదా బీప్ సౌండ్ వేయాలి కానీ ఇలా మాట్లాడింది అంతా వ్యూస్ కోసం పబ్లీష్ చేస్తే అది సరికాదు. పైగా అతను మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు (ebrolukiranch) అంటూ వైసీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మరిన్ని కధనాల కోసం చూస్తునే ఉండండి.